Thursday 26 November 2015

బురఖా ధరిస్తే ఫైన్ వేస్తారంట.. ఎందుకంటే?

స్విడ్జర్లాండ్ లోని టిసినో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బహిరంగ ప్రదేశాల్లో ముఖం కనిపించకుండా బురఖాలు ధరించడాన్ని నిషేధించింది. కాగా, 2013 సెప్టెంబర్ లో బురఖాలపై స్థానిక ప్రభుత్వం రెఫరెండం నిర్వహించగా, అందులో ప్రతీ ముగ్గురిలో ఇద్దరు సానుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆ రెఫరెండం ప్రకారం తీసుకువచ్చిన చట్టాన్ని టిసినో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది.
ఈ చట్టం ప్రకారం.. నిషేధాన్ని ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో ముఖం కనబడకుండా బురఖాలు ధరించిన పక్షంలో ఆరున్నర వేల రూపాయల నుంచి ఆరున్నర లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఈ సందర్భంగా ఇలా బురఖాలను నిషేధించడం ఫెడరల్ చట్టానికి వ్యతిరేకం కాదని కేంద్ర ప్రభుత్వం కూడా సమర్ధించింది. అయితే, ప్రస్తుతం ఈ చట్టాన్ని ఎప్పటి నుంచి అమలులోకి తీసుకువచ్చేది మాత్రం స్థానిక ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, మాల్స్, రెస్టారెంట్స్ తదితర ప్రదేశాల్లో బురఖాలు ధరించకుండా చట్టం తీసుకువచ్చామని, ఈ చట్టం గురించి పర్యాటకులలో అవగాహన కల్పించేందుకు విమానాశ్రయాల్లోనే వారికి ముందుగా తెలియజేస్తామని తెలిపారు. అలాగే బురఖా ముసుగుల్లో టెర్రరిస్ట్ కార్యకలాపాలు, దోపిడీలు, దొంగతనాలకు పాల్పడకుండా నిరోధించడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలియజేశారు.

షాక్ చేస్తున్న ‘కుమారి 21F’ ఓవరాల్ షేర్

కెరీర్ ప్రారంభం లోనే ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’ అంటూ హిట్స్ అందుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ గత వారం రిలీజ్ అయిన ‘కుమారి 21F’తో కూడా సిఉపెర్ హిట్ అందుకొని హ్యాట్రిక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ కథ – స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాతగా మారి చేసిన సినిమా ద్వారా హేభ పటేల్ హీరోయిన్ గా కనిపించింది. మెచ్యూర్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అన్ని ఏరియాలలో సూపర్బ్ కలెక్షన్స్ వస్తున్నాయి.ఒక్క నైజాంలోనే ఓవరాల్ గా ఈ సినిమా 5.5 కోట్ల షేర్ సాధిస్తుందని తెలియజేశాం. ఓవరాల్ గా ఇరు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎంత షేర్ తో క్లోజ్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోగా ట్రేడ్ వర్గాలు అందరూ షాక్ అయ్యే ఫిగర్స్ చెప్పారు. కుమారి 21F ఓవరాల్ గా 16-17 కోట్ల షేర్ తో క్లోజ్ అవుతుందని తెలియజేశారు. అనగా ఈ సినిమా బడ్జెట్ కంటే దాదాపు రెండింతలు కలెక్ట్ చేయనుంది. రాజ్ తరుణ్ కెరీర్లోనే అత్యధిక షేర్ సాధించిన సినిమాగా మిగిలిపోయింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

Friday 20 November 2015

సమీక్ష : చీకటి రాజ్యం – సూపర్ యాక్షన్,సో సో థ్రిల్స్!!

ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే ఉలగనాయగన్ కమల్ హాసన్ నుంచి వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’. ఫ్రెంచ్ మూవీ ‘స్లీప్ లెస్ నైట్’ అనే సినిమాకి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష, ప్రకాష్ రాజ్, మధు శాలిని, సంపత్ లు ముఖ్య పాత్రలు పోషించారు. డ్రగ్ మాఫియా నేపధ్యంలో సాగే ఈ సరికొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్ కి రాజేష్ ఎం సెల్వ డైరెక్టర్. తెలుగు ప్రేక్షకులకి బాగా తక్కువ పరిచయం ఉన్న ఈ జానర్ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దివాకర్(కమల్ హాసన్). చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన దివాకర్ ఓ సారి డబ్బు కోసం తన సహా ఉద్యోగి మణి(యుగి సేతు)తో కలిసి వేరేవాళ్ళు స్మగుల్ చేస్తున్న కొకెయిన్ పాకెట్స్ ని కొట్టేస్తారు. ఈ క్రమంలో కమల్ బ్యాచ్ కొకెయిన్ బ్యాచ్ లో ఒకడిని చంపేస్తారు. దాంతో ఆ ఇన్సిడెంట్ పై ఇన్వెస్టిగేట్ చేయడానికి నార్కోటిక్ ఆఫీసర్స్ అయిన మోహన్(కిషోర్), మల్లిక(త్రిష) రంగంలోకి దిగుతారు. కట్ చేస్తే ఆ కొకెయిన్ పాకెట్స్ మాదాపూర్ లో ఇన్సోమియా అనే నైట్ క్లబ్ నడిపే విట్టల్ రావు(ప్రకాష్ రాజ్)కి సంబంధించినవి.
విట్టల్ రావు కి ఆ కొకెయిన్ పాకెట్స్ చాలా అవసరం, దాంతో అవి కొట్టేసింది దివాకర్ అని తెలుసుకొని తన కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. అలా కిడ్నాప్ చేసి తన కొకెయిన్ ఇచ్చేస్తే కొడుకును రిలీజ్ చేస్తానని, కొకెయిన్ తీసుకొని తన ఇన్సొమియా పబ్ కి రమ్మంటాడు. అలా బయలుదేరిన దివాకర్ ని మల్లికా కూడా ఫాలో చేస్తుంది. కొడుకును విడుదల చేసుకోవడానికి బయలుదేరిన దివాకర్ ఫేస్ చేసిన ప్రాబ్లెమ్స్ ఏమిటి? మల్లిక అండ్ మోహన్ వలన దివాకర్ క్రియేట్ అయిన ఇబ్బందులేమిటి? ఫైనల్ గా దివాకర్ తన కొడుకును కాపాడుకున్నాడా లేదా? నేషనల్ వైడ్ గా ది బెస్ట్ నార్కోటిక్ ఆఫీసర్ అనిపించుకున్న దివాకర్ ఏ రీజన్ తో ఆ కొకెయిన్ దొంగతనం చేసాడు అన్నది? మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ.
ప్లస్ పాయింట్స్ :
యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన చీకటి రాజ్యం సినిమాలో ది బెస్ట్ అని చెప్పుకోవాల్సింది నటీనటుల ఎంపిక మరియు వారి నటన.. ప్రతి పాత్రకి వీళ్ళే పర్ఫెక్ట్ అనేలా నటీనటుల్ని ఎంపిక చేసారు. ముందుగా కమల్ హాసన్ గురించి చెప్పుకోవాలి.. ఒక నార్కోటిక్ పోలీస్ ఆఫీసర్ గా కమల్ హాసన్ పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. ఒకవైపు సీనియర్ పర్సన్ గా, కొడుకును రక్షించుకోవాలనే ఫాదర్ గా, పోలీస్ గా అతను చూపిన హావ భావాలు ఆడియన్స్ ని కట్టి పడేస్తాయి. చీకటి రాజ్యం సినిమాకి మెయిన్ పిల్లర్ కమల్ హాసన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. త్రిష ఒక టఫ్ పోలీస్ గర్ల్ గా కమల్ కి మంచి పోటీని ఇచ్చింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్యా వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ కి తీసుకొస్తాయి. త్రిషకి సపోర్ట్ గా చేసిన కిషోర్ కూడా పోలీస్ గా నెగటివ్ షేడ్స్ ని చాలా బాగా పలికించాడు.
ఇకపోతే మెయిన్ విలన్స్ గా కనిపించిన ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ లు వారి వారి పాత్రలకి న్యాయం చేసారు. వీరిద్దరి పాత్రల్లో సీరియస్ తో పాటు కాస్త హ్యూమర్ ని కూడా పండించడం ప్రేక్షకుల పెదవులపై కాస్త నవ్వును తెప్పిస్తుంది. ఓ ముఖ్య పాత్రలో కనిపించిన మధు శాలిని తన గ్లామర్ తో కాసేపు యువతని, ముందు బెంచ్ వారిని ఆకట్టుకుంటుంది. ఇక నటీనటుల పరంగా చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఆశా శరత్, అమన్ అబ్దుల్లా, యుగి సేతు తదితరులు టం పాత్రల పరిధి మేర చేసారు.
వీరి తర్వాత సినిమాకి హైలైట్స్ గా చెప్పుకోవాల్సిన విషయానికి వస్తే, సినిమా మొదలవ్వడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, అలాగే ఆ తర్వాత వచ్చే కమల్ – ఆశ శరత్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ కాస్త నవ్విస్తే, అక్కడి నుంచి సినిమాని సీరియస్ చేసి చాలా గ్రిప్పింగ్ గా సినిమాని లాగడం మరియు ఫస్ట్ పార్ట్ లో వచ్చే చిన్న చిన్న యాక్షన్ ఎపిసోడ్స్ తో బాగానే సాగుతుంది. ఆ తర్వాత సెకండాఫ్ లో కమల్ – త్రిష, కమల్ – కిషోర్ యాక్షన్ ఎపిసోడ్స్ మరియు ఓకే ట్విస్ట్ ని రివీల్ చెయ్యడం చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సినిమా చివర్లో వచ్చే ఒకే ఒక్క పాటని సూపర్బ్ గా ఎడిట్ చేశారు, సో డోంట్ మిస్ ఇట్. టెక్నికల్ గా జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ మ్యూజిక్ మరియు రాజేష్ టేకింగ్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.
మైనస్ పాయింట్స్ :
చీకటి రాజ్యం సినిమాకి మొదటి మైనస్ గా చెప్పుకోవాల్సింది.. సెకండాఫ్.. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కానీ సెకండాఫ్ కి వచ్చే సరికి సినిమా అంత గ్రిప్పింగ్ గా సాగలేదు. అలాగే ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే సెకండాఫ్ ని బాగా సాగదీసేసారు. ముఖ్యంగా మన నేటివిటీ కోసం యాడ్ చేసుకున్న కొన్ని సీన్స్ సినిమాని కాస్త స్లో చేసాయే తప్ప సినిమాకి పెద్ద హెల్ప్ అవ్వలేదు. క్లైమాక్స్ లో మేజర్ ఫైట్ అయిపోయాక వచ్చే కొన్ని సీన్స్ సినిమాకి పెద్ద అవసరం లేదు. మరో మైనస్ సినిమా రన్ టైం.. ఓవరాల్ రన్ టైం 128:58 నిమిషాలే అయినప్పటికీ చాలా చోట్ల బాగా డ్రాగ్ చేయడం వలన ఈ షార్ట్ రన్ టైం కూడా లాంగ్ గా ఉందనే ఫీలవుతుంది.
అలాగే ఈ సినిమా జానర్ యాక్షన్ థ్రిల్లర్.. అంటే యాఖాన్ తో పాటు ఆడియన్స్ అబ్బో అనిపించినే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కూడా ఉండాలి. కానీ ఈ సినిమాలో ఆడియన్స్ ని థ్రిల్ చేసే ఒక్క థ్రిల్లింగ్ పాయింట్ కూడా లేకపోవడం చెప్పుకోదగిన మరో మైనస్ పాయింట్. ముఖ్యంగా మెయిన్ విలన్ ఎవరనేది దాచి పెట్టడమే ఈ సినిమాకి కీలకం కానీ కథనంలో ఆ విషయాన్ని ఫస్ట్ లోనే రివీల్ చేసెయ్యడం చూసే ఆడియన్స్ కి పెద్ద కిక్ ఇవ్వదు. స్క్రీన్ ప్లే మొత్తం ఆడియన్స్ ఊహించి నట్లే సాగడం, అలాగే నేరేషన్ చాలా చోట్ల బాగా స్లో అయిపోవడం ఈ సినిమాకి మరో మైనస్. ఫాదర్ – సన్ సెంటిమెంట్ యాంగిల్ తో పాటు, కమల్ హాసన్ మిషన్ గురించిన విషయాన్ని ఇంకాస్త క్లియర్ గా చూపించాల్సింది.
సాంకేతిక విభాగం :
‘చీకటి రాజ్యం’ సినిమాకి టెక్నికల్ గా పరంగా చాలా డిపార్ట్మెంట్స్ హైలైట్స్ గా నిలిచాయి. ముందుగా చెప్పుకోవాల్సింది. జన వర్గీస్ సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది, యాక్షన్ థ్రిల్లర్ ఎపిసోడ్ లో చూపిన కెమెరా యాంగిల్స్, విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. అలాగే ప్రేమ్ నవస్ ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంది. ముఖ్యంగా ఇన్సోమియా పబ్ సెట్ ని వేసిన తీరు చాలా చాలా బాగుంది. ఇకపోతే జిబ్రాన్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో హైలైట్. ప్రతి సన్నివేశంలోనూ జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాని చాలా ఎలివేట్ చేసింది. ఎడిటర్ షాన్ మొహమ్మద్ ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా ఎడిట్ చేసాడు, కానీ సెకండాఫ్ ని మాత్రం చాలా సాగ దీసేసారు. సెకండాఫ్ లో చాలా ఎడిట్ చేయాల్సింది. అబూరి రవి డైలాగ్స్ బాగున్నాయి. గిల్లెస్ కాన్సీల్, రమేష్ యాక్షన్ స్టంట్స్ కూడా సినిమ మూడ్ కి తగ్గట్టుగా ఉన్నాయి.
ఇక సినిమాకి మెయిన్ డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే.. కథా పరంగా ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే మన నేటివిటీకి సింక్ చెయ్యాలి అంటూ కొన్ని సీన్స్ ని యాడ్ చేసారు. కానీ ఆ సీన్స్ సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. కమల్ హాసన్ కథనంలో థ్రిల్స్ ఏమీ లేకుండా రాసుకోవడం సినిమాకి చాలా మైనస్ అయ్యింది. డైరెక్టర్ గా రాజేష్ ఎం సెల్వ టేకింగ్ బాగుంది. సీరియస్ థ్రిల్లర్ లో కొన్ని కామెడీ బిట్స్ ని కూడా టచ్ చేయడం బాగుంది. కానీ డైరెక్టర్ కూడా థ్రిల్లర్ సినిమాలో థ్రిల్లింగ్ పార్ట్ ని వదిలేయడం బాలేదు. కమల్ మరియు రాజేష్ థ్రిల్స్ విషయంలో కేర్ తీసుకోవాల్సింది. చంద్రహాసన్ – కమల్ హాసన్ నిర్మాణ విలువలు మాత్రం సూపర్బ్ అనేలా ఉన్నాయి.
తీర్పు :
తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించే యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ‘చీకటి రాజ్యం’ సినిమా డిఫరెంట్ సినిమా కోరుకునే తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతూ అందరినీ కట్టి పడేయడమే కాకుండా సెకండాఫ్ ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ ని క్రియేట్ చేయడం సినిమాకి సూపర్బ్ హెల్పింగ్ పాయింట్. యాక్షన్ అండ్ టేకింగ్ పరంగా వావ్ అనిపించే ఈ సినిమా థ్రిల్స్ విషయంలో మాత్రం కాస్త నిరాశ పరుస్తుంది. ఇది రెగ్యులర్ మాస్ మసాలా మూవీ కాదు కాబట్టి ఆ తరహా సినిమాలు కోరుకునే వారికి ఇది పెద్దగా నచ్చదు. కమల్ హాసన్-త్రిషల పెర్ఫార్మన్స్, ఎంగేజ్ గా అనిపించే ఫస్ట్ హాఫ్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, మ్యూజిక్ సినిమాకి మేజర్ హైలైట్స్ అయితే, సెకండాఫ్ ని సాగదీయడం, థ్రిల్స్ లేకపోవడం, యాడ్ చేసిన ఎక్స్ట్రా సీన్స్ బాలేకపోవడం సినిమాకి మైనస్. ఓవరాల్ గా ఈ సీజన్ లో చూడదగిన డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’.
TELUGUNEWSGOSSIP : 3.00/5

సమీక్ష : కుమారి 21F – యూత్ కి బాగా నచ్చే కుమారి.!

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ సరికొత్త కథలని ప్రేక్షకులకు అందించాలని సుకుమార్ రైటింగ్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి, అందులో మొదటి సినిమాకి తన కథ – స్క్రీన్ ప్లేని అందించి చేసిన సినిమా ‘కుమారి 21F’. ప్రస్తుతం ప్రేమ విషయంలో యువత ధోరణి ఎలా ఉంది అన్న బోల్డ్ పాయింట్ ని టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమాలో రాజ్ తరుణ్, హేభ పటేల్ హీరో, హీరోయిన్స్ గా నటించారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
కెజిబి కాలనీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జీవనం సాగించే ఓ కుర్రాడి ప్రేమకథే ఈ ‘కుమారి 21F’. సిద్దు(రాజ్ తరుణ్) కుకింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి స్టార్ క్రూస్ షిప్ లో చెఫ్ గా వెళ్ళాలని తెగ ట్రై చేస్తుంటాడు. సిద్దుకి ముగ్గురు ఫ్రెండ్స్.. వాళ్ళే శంకర్(నోయెల్), ఫోటోల సురేష్(నవీన్), సొల్లు శీను(సుదర్శన్). వీరు ముగ్గురూ దొంగతనాలు చేస్తూ బయటకి బిల్దప్స్ ఇచ్చుకొని బతుకుతూ ఉంటారు. అదే కాలనీలోకి ముంబై నుంచి వచ్చిన మోడల్ కుమారి(హేభ పటేల్) మొదటి చూపులోనే మన హీరో సిద్దుని చూసి ప్రేమలో పడుతుంటుంది. కుమారికి ఉన్న క్వాలిటీ తను అందరితోనూ ఫ్రెండ్ లా ఉంటూ, ఓపెన్ గా మాట్లాడటం. కొద్ది రోజులకి హీరో కూడా కుమారి ప్రేమలో పడతాడు. కానీ సిద్దు ఫ్రెండ్స్ మాత్రం తను మంచిది కాదని తనొక మోడల్ అని వాళ్ళు అవసరానికి వాడుకుంటారే తప్ప ప్రేమించరని చెప్తుంటారు.
దాంతో లేని పోనీ అనుమానాలు పెంచుకుంటూ వచ్చిన సిద్దు ఓ రోజు వేరే ఎవరి బైక్ మీదో వెళ్తుంటే నిలదీస్తాడు. దాంతో కుమారి తనని అర్థం చేసుకునే మెచ్యూరిటీ తనకు లేదని తన ప్రేమకి నో చెప్పి వెళ్లిపోతుంది. అదే టైంలో సిద్దు ఫ్రెండ్స్ కూడా కుమారిపైన కన్నేస్తారు. అక్కడి నుంచి సిద్దు తన ప్రేమని దక్కించుకోవడానికి, తన ప్రేమని తెలియజేయడానికి ఏమేమి చేసాడు? అసలు కుమారి ఎందుకు అంతలా బోల్డ్ గా ఉండటానికి కారణం ఏమిటి? అసలు ముంబై నుంచి కుమారి హైదరాబాద్ ఎందుకు వచ్చింది? అసలు కుమారి ముంబై కథ ఏమిటి? అలాగే సిద్దు ఫ్రెండ్స్ కుమారిని ఏమన్నా చేసారా? లేదా? అన్నది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ.
ప్లస్ పాయింట్స్ :
సుకుమార్ ఇప్పటివరకూ సున్నితమైన యూత్ఫుల్ కథలను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. అదే తరహాలోనే ఒక యూత్ఫుల్ కథని మరింత బోల్డ్ గా చెప్పడానికి ట్రై చేసి, యూత్ ని మెప్పించిన సినిమానే ‘కుమారి 21F’. ఇప్పుడే యవ్వనంలోకి వచ్చిన నేటితరం యువతలోని భావాలను బేస్ చేసుకొని సుకుమార్ రాసిన ఈ ప్రేమకథ నేటి యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కానీ సుకుమార్ దీనిలో ఎక్కువ భాగం అడల్ట్ కంటెంట్ మీద ఆధార పడ్డాడు. అడల్ట్ కంటెంట్ సినిమాకి ఎక్కువ అయినప్పటికీ ముందు బెంచ్ వారిని ఆకట్టుకొని థియేటర్స్ కి రప్పిస్తుంది. అలాగే సుకుమార్ ఓవరాల్ గా ఈ కథ ద్వారా చెప్పాలనుకున్న రెండు పాయింట్స్ మాత్రం సూపర్బ్ అనిపిస్తాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. రాజ్ తరుణ్ మొదటి రెండు సినిమాల్లో బాగా ఎనర్జిటిక్ గా కనిపించాడు. కానీ ఇందులో ఫస్ట్ హాఫ్ పరంగా సైలెంట్ గా కనిపించిన రాజ్ తరుణ్ సెకండాఫ్ లో తన మార్క్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రాజ్ తరుణ్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. ఇకపోతే కుమారిగా కనిపించిన హేభ పటేల్ నటనతో బాగానే చేసింది అనిపించుకుంది. కానీ మోడ్రన్ అమ్మాయిగా మాత్రం సినిమా స్టార్ట్ టు ఎండ్ అందరినీ తన స్కిన్ షోతో ఆకట్టుకుంది. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం హేభ పటేల్ స్కిన్ షో మీదే నడిపించారు అంటే మీరు ఏ రేంజ్ గ్లామర్ ట్రీట్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక మెయిన్ రోల్స్ చేసిన వారిలో నవీన్, సుదర్శన్ లు తమ పంచ్ డైలాగ్స్ తో కాస్త నవ్విస్తూ వచ్చారు. నోయెల్ నెగటివ్ షేడ్స్ ని బాగా చూపించాడు.
కుమారి 21F అనే సినిమాకి బాగా హెల్ప్ అయిన పాయింట్స్ విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ లో యూత్ ని ఆకట్టుకునే స్కిన్ షో, అడల్ట్ కంటెంట్ సినిమాకి హెల్ప్ అయితే సెకండాఫ్ లో మెయిన్ కథని నడిపించడం, చాలా విషయాలకు క్లారిటీ ఇవ్వడం మరియు క్లైమాక్స్ జస్టిఫికేషన్ ఇచ్చిన విధానం చాలా బాగుంది. అలాగే రాజ్ తరుణ్ – హేభ పటేల్ ల మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగా నవ్విస్తాయి. సుకుమార్ బోల్డ్ కథని రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో మెట్టు పైకి తీసుకెళ్లాయని చెప్పాలి.
మైనస్ పాయింట్స్ :
కుమారి 21F అనేది ఓ బోల్డ్ కాన్సెప్ట్ అని ముందు నుంచి చెప్పుకొని వచ్చారు. కానీ చెప్పాలంటే ఈ సినిమాలో బోల్డ్ కానేప్ట్ ఏమీ లేదు, కానీ ఉన్న కాన్సెప్ట్ ని చెప్పడానికి బోల్డ్ సీన్స్ ని రాసుకున్నారు. హీరోయిన్ స్కిన్ షో అనేది ఎప్పుడూ అందంగా ఉండాలి కానీ ఇందులో హేభ ని చూపిన విశానం కొన్ని చోట్ల బాగా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలాగే కథలో మరీ ఇంతలా ఎక్స్ పోజింగ్ సీన్స్ అవసరం లేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పరంగా ఒరిజినల్ కథలోకి వెళ్ళలేదు, అలాగే హీరో, హీరోయిన్ పాత్రలు ఇవి, ఇలా బిహేవ్ చేస్తాయి అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. సెకండాఫ్ లో సెకండ్ హీరోయిన్ ని పరిచయం చేసి నడిపించే సీన్స్ చాలా రెగ్యులర్ గా అనిపిస్తాయి.
ఇకపోతే సినిమా నేరేషన్ మొదటి నుంచి చివరి దాకా చాలా స్లోగా ఉంటుంది. ఎక్కడా స్పీడ్ గా వెళ్తున్నట్లు అనిపించదు. అలాగే సుకుమార్ కథనం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఎందుకు అంటే సినిమాలో ట్విస్ట్ లు అనేవి ఏమీ లేవు, ట్విస్ట్ లు అనుకున్నవి సినిమా చూడడం మొదలు పెట్టిన కొద్ది సేపటికే ఆడియన్స్ ఊహించేయగలరు. ఇక ఈ సినిమాలో పాటలకి పెద్ద ఆస్కారం లేదు అనిపిస్తుంది. ఒకటి రెండు పాటలు తప్ప మిగతావి ఏవీ సినిమాకి అస్సలు అవసరం లేదు. మొదట్లో వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్, ఐటెం సాంగ్ లు సినిమాకి అవసరం లేదు. అలాగే రాజ్ తరుణ్ గత సినిమాల ఎఫెక్ట్ వలన ఈ సినిమాలో సూపర్బ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని అనుకుంటారు, కానీ ఆడియన్స్ ని బాగా నవ్వించే కామెడీ లేకపోవడం మైనస్.
సాంకేతిక విభాగం :
కుమారి 21F అనే సినిమాకి మెయిన్ సూత్రధారి సుకుమార్ కావున అక్కడి నుంచి మొదలు పెడతా.. సుకుమార్ ఈ సినిమా కోసం నేటి యువతరం భావాలను బేస్ చేసుకొని రాసుకున్న స్టొరీ లైన్ చాలా బాగుంది. అలాగే దానిని పూర్తి కథగా డెవలప్ చేసుకున్నప్పుడు కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ ని కూడా రాసుకున్నాడు. కానీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ అడల్ట్ కంటెంట్ ని రాసుకోవడం బాలేదు. అది కూడా కథని పక్కన పెట్టి ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ రొమాంటిక్ సీన్స్ మీదే దృష్టి పెట్టడం అంత బాలేదు. ఇకపోతే ఆయన రాసుకున్న కథనం బాగుంది, కానీ సూపర్బ్ అనేలా లేదు. అలా రాసుకొని ఉంటే సినిమా కూడా సూపర్బ్ అని అందరూ అనేవారు. స్క్రీన్ ప్లే లో లాగ్స్ ఉండడం వలన గుడ్ అనే రేంజ్ లోనే మిగిలిపోయింది. సుకుమార్ కథ – కథనాన్ని చాలా బాగా ప్రెజంట్ చేసాడు డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్. తను పేపర్ పై రాసుకున్న కొన్ని కీలక సన్నివేశాలను చాలా బాగా డీల్ చేసాడు. మెయిన్ గా క్లైమాక్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే నేరేషన్ విషయంలో కాస్త కేర్ తీసుకోవాల్సింది.
ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీతో మేజిక్ చేసాడని చెప్పాలి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండే కాలనీని చాలా రియలిస్టిక్ గాచూపిస్తూనే, విజువల్స్ ని చాలా బ్యూటిఫుల్ గా ఉండేలా చూసుకున్నాడు. చాలా సీన్స్ లో వాడుకున్న ఒర్జినల్ లైటింగ్ సినిమా మోద కి బాగా హెల్ప్ అయ్యింది. ఇక దేవీశ్రీ ప్రసాద పాటలు హిట్ అయ్యాయి, సినిమాలో చూడటానికి కూడా బాగున్నాయి, కానీ చాలా పాటలకి సందర్భం సింక్ అవ్వలేదు. పాటలను పక్కన పెడితే రత్నవేలు విజువల్స్ కి రీ రికార్డింగ్ తో ఓ అందమైన, వినసొంపైన రూపాన్ని తెప్పించాడని చెప్పాలి. ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఎడిటర్ అమర్ రెడ్డి ఇంకాస్త సినిమా కోసం వర్క్ చేసి కొన్ని అనవసర పాటలని, సీన్స్ ని కట్ చేసి ఉండాల్సింది. పొట్లూరి వెంకీ డైలాగ్స్ బాగున్నాయి. విజయ ప్రసాద్ – థామస్ రెడ్డి – సుకుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఓ భారే బడ్జెట్ సినిమాకి ఉన్నట్టు ఈ సినిమా నిర్మాణ విలువలు ఉన్నాయి.
తీర్పు :
ప్రేమకథలను డిఫరెంట్ పంథాలో ప్రెజంట్ చేసే సుకుమార్ రచయితగా, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ హీరోగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కుమార్ 21F’ సినిమా నేటితరం యువతని అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా, యువతని థియేటర్స్ కి క్యూ కట్టేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటి యువతకి ప్రేమపై ఉన్న ఒపీనియన్ ని బేస్ చేసుకొని తీయడం మరియు సినిమా ఫస్ట్ హాఫ్ లో అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఉండడం యువతని ఆకర్షించే విషయం. ఫస్ట్ హాఫ్ లోని అడల్ట్ కంటెంట్, సెకండాఫ్ లో చెప్పిన స్టొరీ, క్లైమాక్స్ మరియు హేభ పటేల్ స్కిన్ షో సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే ఫస్ట్ హాఫ్ లో శృతి మించినట్టు అనిపించే స్కిన్ షో సీన్స్, కథనం, అక్కడక్కడా డ్రాగ్ చేసిన సీన్స్ మరియు సాంగ్స్ ప్లేస్ మెంట్ సినిమాకి మేజర్ మైనస్. ఓవరాల్ గా ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూడటానికి చాలా ఇబ్బడ్ని పడతారు కావున వారి నుంచి ఈ సినిమాకి ఆదరణ ఉండదు. కానీ యువతకి నచ్చే అంశాలు ఉన్న సినిమా కావడం వలన ఈ ‘కుమారి 21F’ ఈ వారం బాక్స్ ఆఫీసు వద్ద బాగానే కాసులను రాల్చుకుంటుంది.
TELUGUNEWSGOSSIP రేటింగ్ : 3.00/5

Wednesday 11 November 2015

సమీక్ష : అఖిల్ –అక్కినేని కుర్రాడు పాస్ అయ్యాడు

విడుదల తేదీ : 11 నవంబర్ 2015
TELUGUNEWSGOSSIP : 3/5
దర్శకత్వం : వివి వినాయక్
నిర్మాత : నితిన్
సంగీతం : అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్
నటీనటులు : అఖిల్, సయేషా సైగల్, బ్రహ్మానందం..

గత కొద్ది రోజులుగా టాక్ అఫ్ ది టౌన్ గా మారి అక్కినేని అభిమానులతో పాటు, సినీ వర్గాలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘అఖిల్’. ఈ సినిమాకి ఎందుకింత క్రేజ్ అంటే.. అక్కినేని ఫ్యామిలీ మూడవతరం నట వారసుడు, నాగార్జున – అమలల ముద్దుల తనయుడు అఖిల్ తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ అఖిల్ ని లాంచ్ చేస్తూ చేసిన ఈ సినిమాని నితిన్ నిర్మించాడు. ‘అఖిల్’ నేడు దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్ మొదటి సినిమాతో వారి ఆశలను ఎంతవరకూ నిజం చేసాడనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
ఈ కథ మొత్తం జువా అనే బాల్ గురించి కాబట్టి ముందుగా దాని పరిచయం – సూర్యుడి నుంచి విడిపోయిన భూమి మళ్ళీ సూర్యునికి దగ్గరవుతూ ఉండడం వలన భవిష్యత్తులో భూమి మీద ప్రళయం వస్తుందని అప్పటి ఋషులు సూర్య కవచం ఆలియాస్ జువా అనే ఒక బాల్ ని తయారు చేసి భూమధ్య రేఖపై ఆఫ్రికాలోని ఓజా ప్రజలు నివసించే ప్రాంతంలో ప్రతిష్టిస్తారు. ప్రతి సూర్యగ్రహణం రోజు మొదటి సూర్య కిరణాలు దానిమీద పడాలి అలా పడలేదు అంటే ప్రళయం సంభవిస్తుంది.
ఇక కథలోకి వెళితే.. రష్యన్ సైంటిస్ట్ అయిన కతోర్జి ఆ జువా విలువ తెలుసుకొని దానిని దక్కించుకోవాలని చూస్తాడు. కానీ బోడో అనే అతను దానిని తీసుకెళ్ళి సీక్రెట్ ప్లేస్ లో దాచి పెట్టేస్తాడు. అక్కడి నుంచి కట్ చేస్తే.. అఖిల్(అఖిల్) నేటితరం కుర్రాళ్ళలా ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా లైఫ్ ని ఎంజాయ్ చేసే మెంటాలిటీ ఉన్న కుర్రాడు. చూడటానికి సింపుల్ గా ఉన్నా అవసరం అయితే ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయగలిగినవాడే మన అఖిల్. అలా హైదరబాద్ లో స్ట్రీట్ ఫైట్ బెట్టింగ్స్, కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేసే అఖిల్ దివ్య (సయేషా సైగల్)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ దివ్యకి అప్పటికే పెళ్లి సెటిల్ అయ్యి ఉంటుంది, కానీ దానిని అఖిల్ సీక్రెట్ గా చెడగొట్టడంతో దివ్య హైదరాబాద్ వదిలి స్పెయిన్ వెళ్ళిపోతుంది. దివ్యని వెతుక్కుంటూ స్పెయిన్ వెళ్ళిన అఖిల్ ఫైనల్ గా దివ్యని ప్రేమలో పడేస్తాడు.
కానీ ఒక చిన్న విషయంలో దివ్య అఖిల్ ని వదిలి వెళ్ళిపోతాను అంటుంది. అదే టైంలో అఖిల్ గురించి తెలుసుకున్న దివ్య ఫాదర్ మహేష్ (మహేష్ మంజ్రేకర్) అఖిల్ ని చంపాలని ప్రయత్నం చేస్తాడు. అదే టైంలోనే జువా కోసం వెతుకుతున్న మోంబో దివ్యని కిడ్నాప్ చేస్తాడు. జువా కోసం దివ్యని మోంబో ఎందుకు కిడ్నాప్ చేసాడు? జువాకి దివ్యకి ఉన్న సంబంధం ఏంటి? దివ్యను కాపాడాలని మోంబో ప్రాంతానికి వెళ్ళిన అఖిల్ దివ్యను కాపాడుకోవడం కోసం జువాని తెస్తాను అంటాడు? ఫైనల్ గా అఖిల్ జువాని సాధించాడా లేదా? సాధించిన దాన్ని కత్రోజికి ఇచ్చాడా లేక భూ ప్రళయాన్ని ఆపడానికి ట్రై చేసాడా.?అన్నదే మీరు చూసి తెలుసుకోవాల్సిన సస్పెన్స్ స్టొరీ.
ప్లస్ పాయింట్స్ :
అఖిల్ మొదటి సినిమా కాబట్టి అతని నుంచే మొదలు పెడతా..అక్కినేని అభిమానులంతా అఖిల్ ని ఎలా చూపిస్తాడో ఎలా ఫైట్స్ చేస్తాడో అని ఎదురు చూసారు. అభిమానుల దాహాన్ని తీర్చేలానే అఖిల్ తన మొదటి సినిమాలో కనిపించాడు. మొదటి సినిమాలోనే అదిరిపోయే స్టంట్స్ మరియు డాన్సులతో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించుకున్నాడు. చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ తో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించిన అఖిల్ వేసిన స్టెప్స్ అందరి చేత అరుపులు పెట్టిస్తాయి. అలాగే కొన్ని పంచ్ డైలాగ్స్ లో అఖిల్ డైలాగ్ మాడ్యులేషన్ బాగుంది. ఓవరాల్ గా అఖిల్ మాత్రం పవర్ అఫ్ అఖిల్ ని చూపాడు. ప్రతి నటుడు మొదటి సినిమాకే 100% నటనని చూపించలేడు, అలాగే అఖిల్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా హాస్యం పండిచే విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలి. అక్కినేని ఫ్యామిలీలో యాక్షన్ సినిమాకి, సూపర్బ్ డాన్సులకి కేరాఫ్ అడ్రస్ గా అఖిల్ మారే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది.
ఇక అఖిల్ అనే సినిమాకి ప్రాణంగా నిలిచిన ఎపిసోడ్స్ విషయానికి వస్తే.. సినిమా ప్రారంభం. జువా ప్రాముఖ్యత గురించి చెప్పే ఆర్ట్ వర్క్ బాగుంది. అఖిల్ ఇంట్రడక్షన్ ఫైట్ అండ్ సాంగ్ చూడగానే ప్రేక్షకులు అబ్బ.. అదరగొట్టేసాడు అనకుండా ఉండలేరు. ఆ తర్వాత కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ మీ పెదాలపై నవ్వు తెప్పిస్తాయి. ఆ తర్వాత ఇంటర్వల్ యాక్షన్ ఎపిసోడ్ బాగుంది. సెకండాఫ్ లో అఖిల్ చేసిన కొన్ని రిస్కీ స్టంట్స్ బాగున్నాయి. ఓవరాల్ గా 130 నిమిషాల రన్ టైం కూడా సినిమాని ప్లస్ అయ్యింది. పాటల పిక్చరైజేషన్ చాలా బాగుంది. అక్కినేని పాటలో నాగార్జున ఎంట్రీ అండ్ నాగార్జున వేసిన ఎనర్జిటిక్ స్టెప్స్ కాసేపు మంచి ఊపు తెస్తాయి.
ఇక సినిమాలోని మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. సయేషా సైగల్ కి ఇది మొదటి మూవీ అయినప్పటికీ పెర్ఫార్మన్స్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. లిప్ సింక్, సీన్ కి తగ్గా హావభావాలని ఇస్తూ మెప్పించింది. కొన్ని సాంగ్స్ లో సయేషా డాన్సుల్లో చూపించిన ఈజ్ కొన్ని చోట్ల అఖిల్ ని డామినేట్ చేస్తుంది. అఖిల్ ఫాదర్ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ మంచి నటనని కనబరిచి ఆడియన్స్ కి లైట్ గా సెంటిమెంట్ టచ్ ని ఇచ్చాడు. ఇక కమెడియన్స్ గా కనిపించిన బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరిలు ఓకే ఓకే అనిపించేలా నవ్వించారు.
మైనస్ పాయింట్స్ :
పైన చెప్పినట్టు అబ్బా అదిరింది అనే రేంజ్ లో సినిమాని మొదలు పెట్టిన వినాయక్ ఆ తర్వాత సినిమా వేగాన్ని సడన్ గా తగ్గించేసి రొటీన్ కామెడీ ఫ్లేవర్ లోకి తీసుకెళ్ళిపోయాడు. అలాగే కాలేజ్ ఎపిసోడ్స్ లో వచ్చిన సీన్స్ లో అక్కడక్కడా కామెడీ బాగానే అనిపించినప్పటికీ సీన్స్ మాత్రం యాజిటీజ్ గా మనం ఇదివరకూ ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా స్టార్టింగ్ లోనే అసలు కథ ఏంటో చెప్పేసి, దేనికోసం ఇక కథ జరుగుతుంది అనే విషయాన్ని చెప్పేయడం వలన మొదటి నుంచి చివరి దాకా అంతా ఊహాజనితంగా మారిపోతుంది. ఇక ఇంటర్వల్ బ్లాక్ లో వచ్చే ట్విస్ట్ ని కూడా ముందే మనం ఊహించేయవచ్చు. కథా పరంగా జువా అనే కాన్సెప్ట్ తప్ప మిగతా అంతా మన రొటీన్ గా రాసుకోవడం ఈ సినిమాకి మరో మైనస్ పాయింట్.
అఖిల్ సినిమాకి మరో మేజర్ మైనస్.. సెకండాఫ్.. కథనంలో అస్సలు కిక్ లేకపోవడం వలన ఊహించిందే జరుగుతోంది అని ఆడియన్స్ ఫీలవుతున్న టైంలో నవ్వించాలనే తాపత్రయంతో కామెడీని ఇరికించాలని ట్రై చేసారు. ఆ కామెడీ పెద్దగా నవ్వించలేకపోవడం సినిమాకి మైనస్. సెకండాఫ్ లో హీరోయిన్ రోల్ తక్కువ అలాగే, సెకండాఫ్ లో వచ్చే పాటలు చూడటానికి బాగున్నా అసందర్భంగా వచ్చి సినిమా వేగాన్ని దెబ్బ తీస్తాయి. సినిమా ఆలస్యానికి కారణమైన గ్రాఫిక్స్ కూడా చెప్పుకునే స్థాయిలో లేకపోవడం మరో మైనస్. సినిమాకి కీలకం అయిన మెయిన్ పాయింట్ ని క్లైమాక్స్ లో చాలా ఫాస్ట్ గా హడావిడిగా ముగించడం అంతగా ఆకట్టుకోలేదు. వినాయక్ సినిమాల్లో నెగటివ్ రోల్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ ఇందులో మాత్రం విలన్ రోల్ అనేదాన్ని పవర్ఫుల్ గా చూపే ప్రయత్నమే చేయలేదు.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ లో సినిమాకి బాగా హెల్ప్ అయిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే బాగా ఫెయిల్ అయిన డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి.. ఒక్కొక్కదాని గురించి మాట్లాడుకుంటే.. సినిమాకి మొదటి బలం స్టొరీ లైన్ మరియు పూర్తి కథ – వెలిగొండ శ్రీనివాస్ ఎంచుకున్న జువా బ్యాక్ డ్రాప్ స్టొరీ లైన్ బాగుంది, దానికోసం అనుకున్న ఆఫ్రికా నేపధ్యమూ బాగుంది. కానీ పూర్తి కథను రాసుకున్న విధానం మాత్రం చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంది. కథ రొటీన్ అయినా కథనం బాగుంటే సరిపోయేది కానీ వినాయక్ రాసుకున్న కథనంలో ఆడియన్స్ ని కథకి హుక్ చేసే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడం, ఉన్న జువా పాయింట్ ని సినిమా మొదట్లోనే చెప్పేయడం సినిమాకి మరో పెద్ద మైనస్ అయ్యింది. వినాయక్ ఒక కమర్షియల్ డైరెక్టర్ గా కొన్ని కమర్షియల్ అంశాలను మాత్రం పర్ఫెక్ట్ గా చూపించాడని చెప్పాలి. మిగతా కొన్ని కీలక అంశాల్లో వినాయక్ తన మార్క్ తో మెప్పించలేకపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా వినాయక్ సినిమాల్లో కామెడీని బాగా పడుతుంది కానీ ఇందులో కామెడీ కూడా అనుకున్న స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు.
ఇక మిగిలిన వాటిల్లో అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ బాగుంది. స్పెయిన్ లో, బ్యాంకాక్ లో షూట్ చేసిన ప్రతి ఎపిసోడ్ ని చాలా కలర్ఫుల్ గా గ్రాండ్ గా ఉండేలా చూపించాడు. అనూప్ రూబెన్స్ – తమన్ అందించిన పాటలు బాగున్నాయి, కానీ ఆ పాటలకి మంచి లొకేషన్స్, పిక్చరైజేషన్ మరియు అఖిల్ డాన్సులు తోడవడంతో సినిమాలో చూడటానికి చాలా చాలా బాగున్నాయి. ఇకపోతే మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం సినిమాలోని చాలా సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో మ్యూజిక్ ఆడియన్స్ ని పీక్స్ కి తీసుకెళ్తుంది. గౌతంరాజు చాలా వరకూ ఎడిట్ చేసి మనకు ట్రిమ్ వెర్షన్ అందించారు. దీనివలన సినిమా సడన్ గా జంప్ అవుతూ ఉన్నట్టు ఉంటుంది, అలాగే ట్రిమ్ వెర్షన్ లో కూడా అక్కడక్కడా సాగాదీత కనపడుతుంది. ఎస్ఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. రవివర్మ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సింప్లీ సూపర్బ్.. కోన వెంకట్ డైలాగ్స్ చాలా వరకూ బాగానే పేలాయి. ఇక చాలా కర్చు పెట్టి చేసిన సిజి వర్క్ అయితే ఆకట్టుకునేలా లేదు. ఫైనల్ గా నితిన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ విలువలు కథా పరంగా బాగా రిచ్ గా కనిపిస్తాయి. వీరు అంత పెట్టినా సిజి విజువల్స్ ని కేక అనుకునేలా చూపించలేకపోవడం బాధాకరం.
తీర్పు :
‘మనం’ సినిమా చూసి అఖిల్ అభిమానులు మా అఖిల్ మొదటి సినిమాలో ఇరగదీసి ఉంటాడు అని ఎంతో దాహం మీదున్న అభిమానుల దాహాన్ని తీర్చేలా ఉంది ‘అఖిల్’. ఒక కమర్షియల్ హీరోగా లాంచ్ అవ్వడానికి కావాల్సిన అన్ని అంశాలు ఈ అఖిల్’ సినిమాలో ఉన్నాయి, వాటన్నిటినీ పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసి మార్కులు కొట్టేసాడు అఖిల్. ఇప్పటి వరకూ అక్కినేని అభిమానులు చూడని స్టన్నింగ్ స్టంట్స్ మరియు సూపర్బ్ డాన్సులతో ఫ్యాన్స్ కి దీపావళి బ్లాస్ట్ ఇచ్చాడు. అఖిల్, సయేషా సైగల్, స్టొరీ లైన్ మరియు మాస్ ని మెప్పించే కమర్షియల్ అంశాలు సూపర్బ్ అనిపిస్తే.. కథా విస్తరణ, కథనం, సెకండాఫ్ సినిమాకి నెగటివ్స్ గా చెప్పుకోవాలి. కథ – కథనాలు రొటీన్ అనే విషయాన్ని పక్కన పెడితే ఓ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోని లాంచ్ చేసేటప్పుడు ఏ ఏ అంశాలు ఉండాలని అభిమానులు కోరుకుంటారో ఆయా అంశాలు ఇందులో ఉన్నాయి. కావున అఖిల్ పరంగా సినిమాని చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ గా అక్కినేని అభిమానులు మాకూ ఓ కమర్షియల్ హీరో వచ్చాడు అని చెప్పుకునే సినిమా ‘అఖిల్’.
TELUGUNEWSGOSSIP: 3/5

Tuesday 10 November 2015

అల్ ది బెస్ట్ అఖిల్....తెలుగు న్యూస్ గాసిప్ టీం తరపున

రేపు విడుదల అవుతున్న అఖిల్ మూవీ కి అల్ ది బెస్ట్ చెబుతోంది తెలుగు న్యూస్ గాసిప్ టీం...చిత్రం లో అఖిల్ డాన్సు లు బాగా చేసాడని టాక్.నల్ల చిరుత తో వచ్చే ఒక ఫైట్ అద్బుతం గ ఉందని కొన్ని ఆక్షన్ సన్నివేశాలు కూడా చాల బాగా వచ్చాయని టాక్.అల్ ది బెస్ట్ అఖిల్....

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రమేశ్‌పొవార్

ముంబై,నవంబర్10: అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ ‌పొవార్(37) మంగళవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 2015-16 రంజీ ట్రోఫీ ముగిసిన అనంతరం దేశవాలీ క్రికెట్‌ నుంచి కూడా దూరం కాబోతున్నట్లు తెలిపాడు. దీంతో 15 ఏళ్ల సుదీర్ఘ దేశవాలీ కెరీర్‌కు తను దూరం కానున్నాడు. యూఏఈలో త్వరలో ఆరంభంకానున్న మాస్టర్స్ చాంఫియన్ లీగ్‌లో ఆడాలన్న ఉద్దేశ్యంతో తాను అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికినట్లు తెలిపాడు. 2004లో రావల్పిండి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోరమేశ్ ‌పొవార్ అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించాడు. అడపాదడపా రాణించినప్పటికీ అతడు జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించలేకపోయాడు. దీంతో జట్టులో ఎంతో కాలం నిలవలేకపోయాడు. రమేశ్ ‌పొవార్ 2 టెస్టులుతోపాటు 31 వన్డేలకు భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 6 వికెట్లు, వన్టేల్లో 34 వికెట్లు రమేశ్ ‌పొవార్ నేలకూల్చాడు. ఇతడు 2007లో కొచ్చి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో చివరగా భారత్‌ జట్టు తరపున ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రమేశ్ ‌పొవార్ అంతగా ఆకట్టుకోలేకపోయినప్ప టికీ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో మాత్రం అద్భుతంగా రాణించాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 146 మ్యాచ్‌లు ఆడిన రమేష్‌పొవార్ 470 వికెట్లు పడగొట్టాడు.